చాకలి ఐలమ్మ చిత్రపటానికి.. నివాళులర్పించిన కలెక్టర్

గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సాహసంతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ  మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా వెనకబడిన  తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్  పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ  సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం దండెత్తిందని చాకలి ఐలమ్మ పోరాటాలను, త్యాగాలను భావితరాలకు  తెలియజేయాలని పేర్కొన్నారు. బహుజన చైతన్యానికి, మహిళా ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన  చాకలి ఐలమ్మ పోరాటపటిమ నేటికీ  స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram