చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరుమళ్ల   రాయణపేట గ్రామాల మధ్య ముత్యాలమ్మ చెరువు కు వెళ్లే కాలినడక దారిలో ఊకె ప్రసాద్ (35 )అనే వ్యక్తి  చెట్టుకు  ఉరి వేసుకుని మృతి చెందాడు. అయితే ఘటన సుమారు ఐదు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చునని  గ్రామస్థులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram