గోల్డ్ న్యూస్ / ఖమ్మం : కొడుకు వివాహం అత్యంత వైభవంగా నిర్వహించాలని దంపతులు ముచ్చటపడ్డా రు. పెళ్లి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరులో
పోలీసుల వివరాల ప్రకారం…ఎన్టీఆర్ జిల్లా గని ఆత్కూరు గ్రామానికి చెందిన దామినేని శ్రీనివాసరావు (55), రజనీకుమారి (45) దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండగా..కుమార్తెకు ఇది వరకే పెళ్లి జరిపించారు. ఇటీవల కుమారుడికి పెళ్లి నిశ్చయం కావడంతో దంపతులిద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
వివాహానికి ముందు ఇంట్లో ఆచారంగా నిర్వహించే ఉప్పలమ్మ తల్లి పూజకు సంబంధించిన విషయా లను చర్చించడానికి వారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న పూజారి దగ్గరకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో వేగంగా వచ్చిన కోళ్ల వ్యాను వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయా రు. సమాచారం అందుకు న్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కొద్ది రోజుల్లోనే పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్థులు ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుమారుడికి పెళ్లి చేసే భాగ్యం దక్కకుండానే తల్లిదండ్రులు ఈ లోకాన్ని వీడటం అందరినీ కలచివేసింది.









