బీసీల హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన డి సిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్

ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి

గోల్డ్ న్యూస్ / ఖమ్మం : శుక్రవారం ఖమ్మం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం , నగర ఓబీసీ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ , బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి లు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తన ప్రయత్నాన్ని చేస్తుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం లేకపోవడం వలన ఆలస్యం అవుతుందని అన్నారు . బీసీల కోసం ఆమరణ దీక్ష కూడా సిద్ధమైన శ్రీనివాస్ ని అభినందించారు . ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు , ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ , కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు బండారు శ్రీనివాసరావు , బీసీ సంఘం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య , ఉపాధ్యక్షులు అమృతం మల్లికార్జున్ , కార్యదర్శి నాగేశ్వరరావు , నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గాజులు శ్రీదేవి , యువజన విభాగం అధ్యక్షులు కూరపాటి సతీష్ , సీనియర్ నాయకులు గంగరాజు , వీరభద్రం ఎం శివ , గోపి తదితరులు పాల్గొన్నారు .

Facebook
WhatsApp
Twitter
Telegram