నవీన్ యాదవ్ ఇంటివద్ద మొదలైన గెలుపు సంబురాలు

నవీన్ యాదవ్ ఇంటివద్ద మొదలైన గెలుపు సంబురాలు

 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ :జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఇప్పటివరకు 6 రౌండ్ల లెక్కింపు పూర్తవగా, అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 15080 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. నవీన్ యాదవ్ ఇంటివద్ద, పార్టీ కార్యాలయం వద్ద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటివద్ద కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram