రెండేళ్లలో 2 లక్షల మందికి ఉపాధి: మంత్రి వివేక్
తెలంగాణ : రాబోయే రెండేండ్లలో 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్డేడ్ చేయడం గొప్ప ముందడుగు అని, సీఎం చొరవతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఏటీసీ ప్రిన్సిపాల్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. లక్ష్యాలను సాధించేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా కోర్సులు రూపొందించాలని, విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించి శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
Post Views: 54









