అటవీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి ఆదివాసి జేఏసీ  

అటవీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలిజేఏసీ అధ్యక్షులు : పోలేబోయిన వెంకటనారాయణ 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి ( డిఎఫ్ఓ)  కిష్ట గౌడ్ , డివిజన్ అటవీ శాఖ అధికారిని (డీఎఫ్ఓ) మసూద్ మోహినుద్దీన్ డ వినతి పత్రం అందజేసిన కరకగూడెం ఆదివాసీ జేఏసీ.

 

కరకగూడెం:ఏడుళ్ల బయ్యారం రేంజ్ పరిధిలోని లంబాడి ఫారెస్ట్ అధికారులు గిరిజన ఆదివాసులపై కక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ శుక్రవారం రోజున మణుగూరులో భద్రాద్రి జిల్లా డి ఎఫ్ ఓ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో గిరిజనేతరులు మరియు లంబాడీలు కొత్తగా చెట్లు నరికి చేసుకుంటున్న భూమి జోలికి కానీ, ఫారెస్ట్ ట్రెంచ్ తీసిన భూమిని సాగుచేస్తున్న వారి జోలికి వెళ్లడం లేదు. ఆదివాసులు కోతులు పంటను నాశనం చేస్తున్నాయని ఒక చెట్టు నరికిన దాన్ని ఫోటో తీసుకొని రేంజ్ అధికారి సమక్షం లో కాకుండా ఫారెస్ట్ లంబాడా అధికారులు చెప్పబెట్టకుండా రేంజ్ ఆఫీసుకి తీసుకుపోవడం సరైన పద్దతి కాదన్నారు. అటవీ శాఖ బీట్ అధికారులు గిరిజనేతరులు మరియు లంబాడీలు చేసుకుంటున్న భూములలో ఎటువంటి ఎఫ్ సి సి పాయింట్స్ కనబడవు కానీ, కేవలం ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతంలోనే ఎఫ్ సి సి పాయింట్స్ ఎలా వస్తాయని మండిపడ్డారు. వాహనాలు వెళ్ళే మార్గం ఉంటేనే అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు కానీ మార్గం లేని భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. ఫారెస్ట్ అధికారులు ఎవరైనా కానీ సమన్యాయంగా విధులు నిర్వర్తించాలి కానీ కులవివక్షను దృష్టిలో పెట్టుకొని ఒక్క ఆదివాసీ సమాజం పైనే కక్ష పూరితంగా విధులు కొనసాగిస్తే ఆదివాసీ జేఏసీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram