గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను భద్రాద్రి జిల్లా ఎలక్షన్ అబ్జర్వర్ వి. సర్వేశ్వర రెడ్డి బుధవారం పరిశీలించారు. అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు. విద్యుత్తు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Post Views: 66









