తిరుమల శ్రీవారిసేవలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

గోల్డెన్ న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్ /మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు రేవంత్ కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి పూజారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు సాధారణ భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఏకాదశి సందర్భంగా ద్వార దర్శనం కోసం భారీగా తిరుమలకు చేరుకున్నారు. భక్తులతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram