లంచం తీసుకుంటూ పట్టుబడిన మండల సర్వేయర్

గోల్డెన్ న్యూస్/ నిర్మల్  / ఫిర్యాదుదారుని బంధువుకు సంబంధించిన భూమికి హద్దులు నిర్ణయించి, పంచనామా అప్పగించే పనిలో లంచం డిమాండ్ చేసిన మండల సర్వేయర్‌ను తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.

 

నిర్మల్ జిల్లా గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణవర్మ ఫిర్యాదుదారుని నుంచి మొత్తం రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.5,000 తీసుకోగా, మిగిలిన మొత్తంలో నుంచి రూ.7,500ను తన ప్రైవేట్ సహాయకుడు పోల నాగరాజు ద్వారా తీసుకుంటూ ఉండగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

ప్రభుత్వ సేవలకు లంచం అడిగే అధికారులు ఉన్నట్లయితే ప్రజలు భయపడకుండా ఫిర్యాదు చేయాలని ACB సూచించింది.

లంచం అడిగిన సందర్భాల్లో ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని పేర్కొంది.

Facebook
WhatsApp
Twitter
Telegram