ప్రతి కుక్క కాటుకు.. భారీ జరిమానా: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని హెచ్చరించింది.
వీధి కుక్కల అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారించింది. వీధి కుక్కల దాడులపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి కుక్క కాటు ఘటనకు సంబంధిత రాష్ట్రంపై భారీ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని స్పష్టం చేస్తూ, వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, వీధి కుక్కలకు ఆహారం పెట్టేవారూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. కుక్కలపై ప్రేమ ఉంటే వాటిని ఇళ్లకు తీసుకెళ్లి పెంచుకోవాలని వ్యాఖ్యానించింది.









