విషయం తెలుసుకొని పసికందును స్వాధీనం చేసుకున్న సంబంధిత శాఖ అధికారులు.
దారుణం.. ఒ తల్లి నవ మాసాలు మోసి ఎంతో భాధను ఓర్చుకొని శిశువుకు జన్మనిస్తుంది. ఎంత కష్టమైనా ఉన్న తన బిడ్డను మాత్రం అపురూపంగా చూసుకుంటుంది. అలాంటి తల్లి ఇక్కడ శిశువును అమ్మకానికి పెట్టింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండలం, ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీకి చెందిన లాల్ సింగ్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజన మహిళ తన సొంత పసికందును విక్రయించేందుకు సిద్ధపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేదరికమో లేదా ఇతర వ్యక్తిగత కారణాలో తెలియదు కానీ, అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న సంబంధిత శాఖ అధికారులు పసికందును చేరదీసి షాద్ నగర్ పోలీసుల సమక్షంలో మరి కాసేపట్లో శిశు విహార్ కు తరలించనున్నారు….
Post Views: 183









