గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భారత రాష్ట్రసమితి కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ వారందరినీ విచారించి దర్యాప్తు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
Post Views: 19









