యూరియా యాప్ పేరు మీద రైతన్నల ఫోన్లకు ఏపీకే ఫైల్స్.
.సైబర్ నేరగాళ్లు ఖాతా ఖాళీ చేస్తారేమోనని భయపడుతున్న రైతులు
రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యూరియా బుకింగ్ యాప్
ప్లే స్టోర్‌లో ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ పేరుతో అందుబాటులో ఉన్నా.. వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతున్న ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్న రైతులు
ఇప్పటికే సైబర్ నేరగాళ్లు వెంటాడుతున్న నేపథ్యంలో వాటిని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే తమ బ్యాంకు ఖాతా ఎక్కడ ఖాళీ అవుతుందోనని భయపడుతున్న రైతులు
సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఏపీకే ఫైల్స్ వ్యవహారం
యూరియా కోసం రైతులు ఈ ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేస్తుంటే.. ఫోన్లలో అన్ నోన్ యాప్ రిస్క్ అంటూ హెచ్చరికలు వస్తుండడంతో భయపడుతున్న రైతన్నలు
అయినా సరే రిస్క్ ఆప్షన్ ఓకే చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని అధికారుల ఒత్తిడి.. దీంతో అసలే సైబర్ మోసాలు పెరిగిపోతుంటే ఇలాంటి అనధికారిక ఫైల్స్ ద్వారా తమ ఫోన్లలోని సమాచారాన్ని తీసుకొని బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తారేమోనని ఆందోళన చెందుతున్న రైతులు









