గుడుంబా తయారు చేసేందుకు వినియోగించే 1000 లీటర్ల బెల్లం పానకంతో పాటు కుండలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు ఎస్సె తెలిపారు.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలోని కౌలూరు, కలవల నాగారం అటవీ ప్రాంతంలోని రాళ్లవాగు వాగు సమీపంలో గుడుంబా తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కరకగూడెం ఎస్సై పివిఎన్ రావు ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడి చేయడం జరిగింది. దాడుల్లో సారా తయారీకి ఉపయోగించే సుమారు 1000 లీటర్ల బెల్లం పాకం నిల్వ ఉంచిన డ్రమ్ముల్ని ధ్వంసం చేసినాటు సారా తయారు ఉపయోగించే బిందెలు గిన్నెలను కూడా ధ్వంసం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… కొందరు వ్యక్తులు ప్రత్యామ్నాయ ఆదాయం పేరిట గుడుంబా తయారు చేసి తమ పరిసర గ్రామాల పేద కుటుంబాల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. జీవనోపాధి పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయని సూచించారు. నాటు సారా తయారీదారులు స్వచ్ఛందంగా మానుకోవాలి అన్నారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. అదేవిధంగా మండల ప్రజలుకు ఎవరైనా సారా కాచిన మరియు అమ్మిన కరకగూడెం పోలీసువారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్లు
8712682102
8712682103

Post Views: 416









