స్వచ్ఛ మిత్ర స్కావెంజర్లకు నిర్దిష్ట వేతనం గా చేసి సొంత ఎకౌంట్లో జమ చేయాలి .
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / మండలంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛమిత్ర స్కావెంజర్లకు నిర్దిష్టంగా వేతనం ఫైనల్ చేసి స్వంత అకౌంట్లో జమ చేయాలని సిఐటియు మండల కన్వీనర్ కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం స్వచ్ఛ మిత్ర స్కావెంజర్ల జనరల్ బాడీ సమావేశం మండల కేంద్రాల్లో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలో పరిశుభ్రత కోసం స్వచ్ఛమిత్ర స్కావెంజర్స్ ను ఏర్పాటు చేశారు తప్ప వారికి ఇస్తుంది నిర్దిష్ట వేతనమో లేక గౌరవ వేతనమో అనేది అర్థం కావడం లేదని వారన్నారు ప్రతినెల ప్రభుత్వం పాఠశాలలకు కేటాయిస్తున్న డబ్బులతో మెయింటెనెన్స్ కే సగం డబ్బులు తీసుకుంటూ ఉంటే స్కావెంజర్లకు ఇచ్చేది సగం మాత్రమేనని వారన్నారు వారికి కుటుంబ పోషణ భారంగానే ఉండే పరిస్థితి ఉందని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉండి పనిచేస్తే రోజుకు 100 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు అనంతరం ఎంఈఓ మంజూల గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ మిత్ర. స్కావెంజర్లు నిరోషా, సుశీల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు









