జిల్లా వైద్యాధికారి తుకారం రాథోడ్. పీహెచ్సీ లతోపాటు , ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు ,
ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి / జిల్లాలోని మారుమూల ప్రాంతాల పీహెచ్సీలను ఆర్ఎంపి క్లినిక్స్ ను ప్రైవేటు హాస్పిటల్స్ లోను ముమ్మర తనిఖీలు, లోపాలు ఉన్న వాటిపై వెంటనే చర్యలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో భద్రాచలం ఉప జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం పరిధిలోని ఏడు సబ్ సెంటర్ల సిబ్బంది, సూపర్వైజర్లు మరియు ఉప జిల్లా వైద్య శాఖ భద్రాచలం సిబ్బంది పాల్గొన్నారు.సమావేశంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పలు ముఖ్య సూచనలు చేశారు. ఆరోగ్య కార్యక్రమాల డేటా ఎంట్రీ పనుల నిమిత్తం మలేరియా సిబ్బందిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి రోటేషన్ పద్ధతిలో ప్రాంతీయ వైద్య కార్యాలయం భద్రాచలంలో విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.
గర్భిణీ స్త్రీలకు సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. సాధారణ ప్రసవం ద్వారా శిశువు శరీర అవయవాల సహజ వికాసానికి సహాయపడుతుందని తెలిపారు. అవసరం లేని సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు ప్రతి గర్భిణీకి సాధారణ ప్రసవం ప్రయోజనాలు, అలాగే సిజేరియన్ ప్రసవం యొక్క లాభ నష్టాల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు.అలాగే, టీకాల నిల్వ సక్రమంగా నిర్వహించేందుకు బూర్గంపాడులో ఉన్న ఐఎల్‌ఆర్ (వాక్సిన్ ఫ్రిజ్)ను వెంటనే భద్రాచలానికి తరలించాలని సూచించారు, ఎందుకంటే ప్రస్తుతం అక్కడి ఫ్రిజ్ పనిచేయడం లేదు.
అనంతరం శ్రీ లీలా క్లినిక్ ను తనిఖీ చేయగా,వాడిన సిరింజులు సక్రమంగా నిర్వహించకపోవడం, మూడు పడకలు మరియు ఇద్దరు పారామెడికల్ సిబ్బందితో క్లినిక్ నిర్వహించడం వంటి లోపాలు గుర్తించబడ్డాయి. ఈ లోపాలపై క్లినిక్ యజమానికి నోటీసు జారీ చేసి, ఆరు రోజులలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అదేవిధంగా, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీ దుర్గ డైగ్నోస్టిక్ (సారపాక) మరియు నీరజ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ భద్రాచలం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో క్రింది లోపాలు గుర్తించబడ్డాయి:
అర్హతలేని పారామెడికల్ సిబ్బంది విధుల్లో ఉన్నారు.క్యాజువాలిటీ విభాగంలో అత్యవసర ఔషధాల కిట్ అందుబాటులో లేదు.అనాఫైలాక్సిస్ కిట్ లేదు.
ఆసుపత్రి పడకల సంఖ్యకు అనుగుణంగా నర్సింగ్ అధికారులను నియమించలేదు.
ఒక వైద్యుడి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నమోదు నవంబర్ 2025లో గడువు ముగిసింది.పై లోపాల దృష్ట్యా, నీరజ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ భద్రాచలం యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, ఆరు రోజులలోగా వివరణ సమర్పించాలని ఆదేశించారు. గడువులోగా సరైన వివరణ అందించకపోతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరచడం మరియు నిబంధనల అమలు కఠినంగా కొనసాగుతాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తెలిపారు.ఈ కార్యక్రమం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ ఉప వైద్య అధికారి భద్రాచలం,మోహన్ డి పి ఎం ఓ, ఏడు ఊకేంద్రాల సిబ్బంది, సూపెరవైజర్, గొంది వెంకటేశ్వర్లు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.









