ఆదిలాబాద్ జిల్లా వాగులో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ బ్రిడ్జి వద్ద అదుపుతప్పి వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు
పలువురు ప్రయాణికులకు గాయాలు, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు గాయాలైన వారికి 108 వాహనాలు ద్వారా ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాంపూర్ వాగులో బస్సు ఎలా పడ్డ దాన్న విషయం కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో జరిగిందా లేక అదుపుతప్పి జరిగిందా విషయం ఇంకా తెలియలేదు. సంఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. షాంపూర్ సర్పంచ్ దీపక్ సంఘటన స్థలంలో గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.
బోడ వంతెన వల్లే ప్రమాదం..
ఉట్నూరు మండలంలోని షాపూర్ సమీపంలోని చిన్న వాగు వంతెనకు ఇరు వైపులా అడ్డుగా కట్టడాలు లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ వంతెన వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేవు. వంతెన వచ్చే వరకు కనిపించదు. ఆ వంతెన ఎక్కువ ఎత్తుగా లేకపోవడం అందులో నీరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అధికారులు వంతెనకు ఇరువైపులా అడ్డుగా కట్టించక పోవడం అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదానికి కారణమని ప్రజలు పేర్కొంటున్నారు.
Post Views: 22









