వట్టివాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి
వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన రేగా కాంతారావు
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / రైతులకు ఉపయోగపడే వట్టి వాగు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు అన్నారు.
బుధవారం కరకగూడెం ఏజెన్సీ మండలంలోని చొప్పాల గ్రామ పంచాయితి పరిధిలో గొడుగుబండ సమీపంలో రైతులు రెండు పంట పండించే విధంగా వట్టివాగు ప్రాజెక్టు గత ప్రభుత్వం రేగా కాంతారావు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది.ఆ ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో రేగా కాంతారావు కార్యకర్తతో కలిసి సందర్శించడం జరిగింది.ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని సూపర్వైజర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,పార్టీ ప్రజా ప్రతినిధులు,అనుబంధ సంఘాలు నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గోన్నారు.
Post Views: 724








