గోల్డెన్ న్యూస్ /బూర్గంపాడు / గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల నరకయాతన అనుభవిస్తున్నామని చెరువు సింగారం ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. రహదారి సౌకర్యం లేకరోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
బూర్గంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు గురువారం రోడ్డుని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ రోడ్డు నిర్మించాలని ఆదివాసి గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు అని అన్నారు
బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెరువు సింగారం రోడ్డు నకిరిపేట నుండి గోపాలపురం పోయే రోడ్లకు శంకుస్థాపన చేసి మెటల్ కంకర వేశారు
కానీ ఇంతవరకు ఆ రోడ్లకు బిటి రోడ్డు గాని సిసి రోడ్డు గానీ వేసిన పాపాన పోలేదు ప్రభుత్వం గానీ అధికారులు కానీ ఆదివాసి గిరిజన గ్రామాలను ఐటిడిఏ పరిధిలోకి వస్తాయి కానీ ఇంత మట్టికి ఐటీడీఏ పీఓ గాని పాలకులు గానే పట్టించుకునే పరిస్థితి లేదని నిండు చూలాల గర్భిణి మహిళలు ఆ రోడ్డు నుండి ఆస్పత్రికి పోవాలంటే ప్రమాదంగా ఉంది రోడ్డు చెరువు సింగారం గోపాలపురం ఆ ప్రాంతంలో ఆ గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులు ఆసుపత్రికి కి వెళ్లే పరిస్థితి లేకుండా రోడ్లు అధ్వానంగా తయారై ఉన్నాయని ఆయన అన్నారు
వెంటనే అధికారులు, పాలకులు చెరువు సింగారం గోపాలపురం రోడ్లు నిర్మించాలని పిఎం పార్టీ డిమాండ్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఆయా గ్రామాలకు రహదారులు నిర్మించకుంటే పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజనులతో పాటు సిపిఎం పార్టీ ఆందోళన పోరాటాలు చేయటానికి వెనకాడకపోమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్ప బాలరాజు ఇరుకం రాజేష్ పొట్ట వసంతరావు సర్ప రాజు మల్కం కృష్ణ పొడియం శ్రీను తదితరులు పాల్గొన్నారు








