17 ఏళ్ల క్రితం బాలిక మృతదేహం ఖననం ఇప్పటికీ చెక్కుచెదరకుండా

17 సంవత్సరాల క్రితం మృతి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందిన బాలిక మృతదేహం ఖననం స్మశానం వాటికలో గోయి తీస్తుండగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా బయట పడ్డ బాలిక మృతదేహం

 

గోల్డెన్ న్యూస్ /ఇల్లెందు /  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఖననం చేసిన మృతదేహం కొన్ని సంవత్సరాల్లో మట్టిలో కలిసిపోతుంది. అయితే ఇక్కడ గత 17 ఏళ్ల క్రితం ఖననం చేసిన ఓ ముస్లిం బాలిక మృతదేహం చెక్కుచెదరకుండా బయటపడటం స్థానికులను విస్మయానికి గురిచేసింది.

 

ఇల్లెందు నంబర్-2 బస్తీకి చెందిన అబ్దుల్ అజమ్ ఖాన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్థానిక ఖబరస్థాన్‌లో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. 2009లో అనారోగ్యంతో మృతి చెందిన ఆయన అన్న కూతురు నస్రీన్ సమాధి పక్కనే అజమ్ ఖాన్‌ను ఖననం చేయాలని నిర్ణయించారు.ఈ క్రమంలో గోతిని తవ్వుతుండగా పక్కనే ఉన్న నస్రీన్ సమాధి భాగం బయట పడింది. 2009లో పదేళ్ల వయసులో మరణించిన ఆ బాలిక మృతదేహం ఎలాంటి క్షయం లేకుండా కనిపించడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

శవంపై కప్పిన కఫన్ వస్త్రం రంగు మారకుండా ఉండటం మాత్రమే కాకుండా, కనీసం చెదలు పట్టకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. 17 సంవత్సరాల తర్వాత కూడా మృతదేహం అలాగే ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

ఈ ఘటనను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు దీనిని దైవ మహిమగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న మత పెద్దలు అక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని మళ్లీ యథావిధిగా ఖననం చేశారు. అయితే ఈ సంఘటనపై అధికారికంగా శాస్త్రీయ పరిశీలన జరిగిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram