బిడ్డను ఉయ్యాలలో వదిలి.. చెట్టుకు ఉరేసుకున్న దంపతులు

బిడ్డను ఉయ్యాలలో వదిలి.. చెట్టుకు ఉరేసుకున్న దంపతులు

 

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జంగమయ్య పల్లి గ్రామానికి చెందిన దంపతులు అప్పులు తీర్చే మార్గం కనిపించక, తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, చెట్టుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram