గోల్డెన్ న్యూస్ /ఇల్లందు / సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన యువతి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 178వ ర్యాంకు సాధించడం కుటుంబ సభ్యులు స్థానికులను ఆనందింపజేసింది. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ యువతి కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించడం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
చదువులో పట్టుదల, ఏదో సాధించాలని తపనతో ముందుకు సాగిన ఆమె, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ.. వెనుకడుగు వేయకుండా లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేసింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకంతో సివిల్స్ పరీక్షల్లో మంచి ఫలితాన్ని సాధించింది.
తన విజయానికి కారణం కష్టపడి చదవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమేనని ఆమె తెలిపింది. యువత లక్ష్యాన్ని నిర్ణయించుకుని పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనని పేర్కొంది.
Post Views: 122









