మానవత్వం చాటుకున్న ఎస్ఐ

మతిస్థిమితం లేని వృద్ధడికి చేయూతనిచ్చిన భద్రాద్రి జిల్లా కరకగూడెం ఎస్సె పివి నాగేశ్వరరావు గురువారం తన మానవత్వాన్ని చాటుకున్నారు.

**************************************

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / కరకగూడెం మండలం వట్టంవారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న ఓర్సు మల్లయ్య సుమారు 75 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా భార్య చనిపోవడంతో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పివి నాగేశ్వరరావు గురువారం చేరదీసి అతనికి కటింగ్ సేవింగ్ చేయించి నూతన దుస్తులు ఆహారం అందజేసి తన మానవత్వం చాటుకున్నారు..ఎస్సై పివి నాగేశ్వరరావు అనాథ వృద్ధుడిపై చూపించిన మానవత్వాన్ని పలువురు కొనియాడారు.

Facebook
WhatsApp
Twitter
Telegram