ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

 

కలెక్టర్ గురువారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి  ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ పీహెచ్ డాక్టర్ కు సూచించారు. అలాగే ఆసుపత్రిలో సిబ్బంది వివరాలు, వైద్యుల వివరాలు తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓపీకి ఎంత మంది వస్తున్నారు అని ఆరా తీశారు. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram