గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని భద్రాచలం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని వైద్య రికార్డులు, రిజిస్టర్లు,ప్రజలకు ఇచ్చే మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి రోజువారీగా వచ్చే రోగుల సంఖ్య వారికి అందించే చికిత్స సేవలు,అత్యవసర మందుల నిల్వల వివరాలు అడిగారు.ఈ సందర్భంగా వారు డాక్టర్స్ మరియు సిబ్బందితో మాట్లాడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి, సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.మందుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పాటించాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. నెల వారి లక్ష్యాలను చేరుకోవాలి అన్నారు. ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వాయిస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
అదేవిధంగా కరకగూడెం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలతలపై పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కార్యాలయం హెచ్ఈఓ గొంది వెంకటేశ్వర్లు, కరకగూడెం వైద్యాధికారి డాక్టర్ రవితేజ, కరకగూడెం హెచ్ఈఓ పోలె బోయిన కృష్ణయ్య , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.









