బండి భగీరథ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ / పేట్‌ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన కేసు విచారణను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. కేసు దర్యాప్తును సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

 

కేసుకు సంబంధించిన వివరాలను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 8న ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించే విధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కారణంగా విచారణలో ఆలస్యం జరిగిందని డీజీపీ తెలిపారు.

 

అయితే కేసు విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తక్షణమే విచారణను ముమ్మరం చేసి, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram