పామ్ ఆయిల్ తోటకు నిప్పు అంటుకొని నష్టపోయిన రైతు,
ప్రభుత్వం ఆదుకోవాలి -రైతు పోలేబోయిన వెంకటనారాయణ. వేడుకోలు
గోల్డెన్ న్యూస్/ కరకగూడెం / పామ్ ఆయిల్ తోటకు నిప్పు అంటుకొని పామ్ ఆయిల్ చెట్లు కాలిపోవడంతో కష్టాల ఉబిలో కూరుకుపోయిన రైతు వెంకటనారాయణ . బాధితుడు తెలివైన వివరాల ప్రకారం కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామంకు చెందిన పోలేబోయిన వెంకటనారాయణ అనే రైతు గత సంవత్సరం సుమారు 3ఎకరాలలో 1లక్ష రూపాయలతో పామ్ ఆయిల్ మొక్కలు వేసి సాగు చేస్తున్న తరుణం గురువారం రోజున మధ్యాహ్నం సమయంలో ఆకస్మాతుగా నిప్పు అంటుకొని మొక్కలు కాలిపోయి ఆ రైతుకు నష్టాలను మిగిల్చింది. పంట ఎదుగుతున్న సమయంలో ఇలా జరగడం ఆ రైతుకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఆ కాలిన తోటను చూసి చలించిపోయిన రైతు ఆవేదనతో ఇటువంటి సమయంలో ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుకుంటున్నాడు.
Post Views: 338









