సెల్ ఫోన్లో సిగ్నల్ లేక వినియోగదారుల ఇబ్బందులు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /మండల కేంద్రంలో సెల్ ఫోన్ వినియోదారులు సిగ్నల్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ టెల్, నెట్ వర్క్ గత నాలుగు- ఐదురోజుల నుండి సిగ్నల్స్ సరిగా రాకపోవడంతో వినియోదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఫోన్ కు ఏం జరిగిందో అని వినియోదారులు రిపేరు సెంటర్ లకు పరుగులు పెడుతున్నారు. అత్యవసర సమయాలలో తమ ఇబ్బందులను బంధువులకు, మిత్రులకు సమాచారం ఇవ్వలేకపోతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తమ తమ నెట్వర్క్  యొక్క సిగ్నల్స్ సమస్య తలెత్తకుండా చూడాలని  వినియోగదారులు కోరుతున్నారు. బంధువులకు, మిత్రులకు సమాచారం తెలపాలన్నా సిగ్నల్స్ ఉన్నచోటికి పరుగులు పెట్టవలసి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వినియోగదారుల సమస్యను తీర్చాలని కోరారు.

Facebook
WhatsApp
Twitter
Telegram