ఇదెక్కడి కిరాతకం? నీచమైన దారుణం….? తనను పోక్సో కేసులో అరెస్ట్ చేయించారని ఆరుగురుని చంపేసిన క్రూరుడు…..సమాజానికి పట్టిన ఓ చీడ పురుగు…
రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పోక్సో కేసు పెట్టి తనను జైలుకు పంపించారన్న కక్షతో ఓ దుర్మార్గుడు ఆరుగురుని పొట్టనపెట్టుకున్నాడు. షాబాద్ మండలకేంద్రం దైవాలగూడలో రాజ్‌కుమార్ అనే అర్థరాత్రి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. దేవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్ అనే వ్యక్తి తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నాయనమ్మతో పాటు.. ఇంటివద్దకు వచ్చి తన భార్య సరిత, ఇద్దరు పిల్లలను కూడా చంపేశాడు. తనను వేధిస్తున్నాడంటూ.. దైవాలగూడలో ఓ బాలిక నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో మే16న పోక్సో కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్ జోషీ తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్థరాత్రి సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్లిన అతను.. ఆమె తల్లి, నాయనమ్మను నరికి చంపేశాడు.ఆ తర్వాత బాలికను సమీపంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత కూడా అతని ఉన్మాదం చల్లారలేదు. ఇంటికి వచ్చి.. తన భార్య సరితతో పాటు..మూడేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నపిల్లలను కూడా చంపేశాడు. వీరందరినీ చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి.. తాను ఆరుగురును చంపానని .. తాను కూడా చనిపోతున్నాని చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నిందుతుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అతని కోసం ఏడు బృందాలు గాలింపు చేపట్టాయి…. ఇలాంటి మానవ మృగాలు కు సమాధానం… ఉరి శిక్ష లు సరిపోవు…..!…








