కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా

కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు !

 

iBomma పైరసీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇమ్మడి రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

 

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు సంబంధించిన అన్ని బ్యాంక్ ఖాతాలను, ప్రాపర్టీ డిపాజిట్లను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 

అయితే, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవ్వడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తన కుటుంబ పోషణ, నిత్యవసరాలు మరియు వైద్య ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని రవి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

 

కుటుంబ జీవనం సాగించడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి వీలుగా తన ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాలలో కొన్నింటినైనా అన్‌ఫ్రీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

 

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దీనిపై పోలీసుల వివరణ కోరే అవకాశముంది.

Facebook
WhatsApp
Twitter
Telegram