800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

ఎక్సెజ్ అధికారుల సంయుక్త దాడులు. 800 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేసిన అధికారులు.

 

 

కరకగూడెం  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామంలో నాటు సరా తయారీ కోసం అక్రమంగా పులియబెట్టిన బెల్లం పానకంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మణుగూరు ఎక్సైజ్ స్టేషన్, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్, కొత్తగూడెం డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 800 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగింది.

 

ఈ సందర్భంగా మణుగూరు ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అక్రమంగా నాకు చాలా తయారీ కోసం పులియబెట్టిన బెల్లం పానకాన్ని తయారు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటుసారా తయారీకి అవసరమైన ముడి సరుకులను విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

అక్రమ నాటు సారా తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నాటుసారా తయారీని అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

 

 

దాడులు నిర్వహించిన వారిలో మణుగూరు ఎక్సెజ్ ఎస్సె విజయభాస్కర్, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీనివాసరావు, కొత్తగూడెం డీటీఎఫ్ ఎస్సై సమీవుల్లా ఖాన్, సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, వీరబాబు, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram