మణుగూరులో 4.1 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..
మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామ సమీపంలోని సీతారామ కెనాల్ వద్ద వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.1 కిలోల ఎండు గంజాయి, ఒక హీరో స్ప్లెండర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను మణుగూరు ఎక్సైజ్ సీఐ కె. నాగేశ్వరరావు వెల్లడించారు.
Post Views: 28








