ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు

కరకగూడెం : పాలేరు శాసనసభ్యులు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు మీద ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులు,శుభాకాంక్షలు పరస్పరం జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, సర్పంచులు పోలేబోయిన సుజాత, ఎర్రం పొట్టయ్య, ఎల్లబోయిన ముత్తమ్మ, బాడిష పార్వతి, కొమరం సుగుణ, ఉపసర్పంచులు పూజారి వెంకన్న, గాంధర్ల రామనాథం, ఎస్సీ సెల్ అధ్యక్షులు జాడి శ్రీను, మండల నాయకులు గొగ్గలి రవి, షేక్ రఫీ , మేడి శ్రీను, మాజీ ఉపసర్పంచ్ లు కొమరం వెంకటేశ్వర్లు, బాడిష లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram