మరో నాలుగు టర్ములు కాంగ్రెస్ దే అధికారం

గోల్డెన్ న్యూస్ / వనపర్తి : మరో నాలుగు టర్ములు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది నేనే సీఎం, ఇర‌వై ఏండ్ల పాటు త‌నే సీఎంగా ఉంటే బీఆరెస్‌, బీజేపీ బ‌తుకులు అగమ్య గోచరంగా మారుతాయని ఆ పార్టీల నేత‌లు భ‌య‌పడుతున్నార‌ని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఏడాది పాల‌న‌లోనే త‌న‌ను త‌ట్టుకోలేక‌పోతున్న కేసీఆర్‌, బీజేపీ నేత‌లు.. ప్ర‌భుత్వంపై అబండాలు వేస్తున్నారని దిగిపోవాల‌ని కోరుకుంటున్నార‌న్నారు.

వ‌న‌ప‌ర్తిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఐదేళ్ల కోసం త‌మ‌ను జ‌నాలు ఎన్నుకుంటే అప్పుడే దిగిపోవాల‌ని కోరుకోవ‌డ‌మేంట‌ని ప్రశ్నించారు ఆయన. ప‌దేండ్ల పాటు దోచుకున్నారు. ప‌చ్చ‌గున్న తెలంగాణ‌ను మంట‌గ‌లిపారు. వెచ్చ‌గున్న చోట ఫామ్‌హౌజ్ ల‌ల్ల పండుకున్నారు. చేయాల్సిందంతా చేశారు. దోచుకోవాల్సిందంతా దోచుకున్నారు. ఇప్పుడు మాకిచ్చారు జ‌నాలు అధికారం.

 

ఇప్పుడే త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఇక పదిహేను, ఇర‌వై ఏండ్ల పాటు నేనే సీఎంగా ఉండి.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే వారి బతుకులు ఆగామ్య గోచరంగా మారుతాయి అని ఇప్పుడే తెలిసిపోయింది . వారికి. అందుకే ఇవ‌న్నీ అబ‌ద్దాలు ఆడుతూ ప్రభుత్వంపై అబండాలు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram