కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన సీఎం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం  హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. నగర భద్రతపై  తీసుకునే నియంత్రణపై ఈ కేంద్రంలో జరుగుతున్న  విధానాలను సీఎం సమీక్షించారు.

 

కంట్రోల్ రూమ్ లోని సాంకేతిక వ్యవస్థలను పరిశీలించిన ముఖ్యమంత్రి, నగరంలో నిరంతర నిఘా కొనసాగించడంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడి, పలు సూచనలు చేశారు.

హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పూర్తిగా అనుసంధానం చేయాలని ఆదేశించారు.

నగరంలోని ప్రతీ కూడలిని నిరంతరం పర్యవేక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

భద్రతా చర్యలు మరింత సమర్థంగా అమలు  చేయడం కోసం సాంకేతిక సదుపాయాలను నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిపూర్ణంగా పనిచేసేలా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram