నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ఫిలిం నగర్ రోడ్డు నెంబర్–7లో నివాసం ఉంటున్న శివ ప్రసాద్ అనే వ్యక్తి

కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్ళిన శివ ప్రసాద్

మూడు రోజుల క్రితం ఆ తాళం పగలగొట్టి, ఇంట్లో ఆస్తులు, గోడలు ధ్వంసం చేసి, ఇంటిని ఆక్రమించేందుకు యత్నించిన బెల్లంకొండ సురేష్ మరియు ఆయన అనుచరులు

ఇంటికి వచ్చి ధ్వంసమైన వస్తువులను చూసి విషయం తెలుసుకొని, తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపిన బాధితుడు శివ ప్రసాద్

శివ ప్రసాద్ సిబ్బందిపై అసభ్యకరంగా దూషిస్తూ దాడికి యత్నించిన బెల్లంకొండ సురేష్

దీంతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ సురేష్‌పై ఫిర్యాదు చేసిన శివ ప్రసాద్.. కేసు నమోదు చేసిన పోలీసులు.

మరి ఈ వ్యవహారం మీద బెల్లంకొండ సురేష్ అయితే ఇంత వరకు స్పందించలేదు. ఇది వరకు కూడా నిర్మాత మీద ఇలాంటి కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల మీద మాత్రం సురేష్ స్పందించారు. తాను ఎలాంటి కబ్జా చేయలేదని, అడిగినంత డబ్బు ఇచ్చే కొనుగోలు చేశానని రియాక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఈ వ్యవహారం మీద నిర్మాత ఎలా స్పందిస్తారో చూడాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram