నూతన డీసీసీలకు మంత్రి పొంగులేటి అభినందన.

 

గోల్డెన్ న్యూస్ /ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతనంగా నియామకమైన డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త అధ్యక్షులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా తోట దేవి ప్రసన్నను, ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నూతి సత్యనారాయణను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఖమ్మం కార్పొరేషన్ అధ్యక్షుడిగా దీపక్ చౌదరి నియమితులయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ఈ కొత్త నాయకత్వం కీలక పాత్ర పోషించాలని మంత్రి పొంగులేటి సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయ పరచుకుని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకువెళ్లడంపై  దృష్టి సారించాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram