దీక్షలో ఉంటే సెలవులు తీసుకోండి : తెలంగాణ పోలీసు శాఖ

విధి నిర్వహణలో దీక్షా వస్త్రాలు ధరించవద్దని ఆదేశం

నిబంధనలు ఉల్లంఘించిన కంచన్‌బాగ్‌ ఎస్సైకి మెమో

గడ్డం, జుట్టు పెంచడంపైనా నిషేధం

 

తెలంగాణ : పోలీసులు మతపరమైన దీక్షలో ఉంటే సెలవులు తీసుకోవాలని డ్యూటీలో ఉండకూడదు అని తెలంగాణ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కంచన్‌ బాగ్‌ ఎస్సైకి మెమో జారీ చేసింది. పోలీసు శాఖ నిబంధనల ప్రకారం … పోలీసులు జట్టు, గడ్డం పెంచుకోకూడదని, సివిల్‌ డ్రైస్‌ లో డ్యూటీ చేయకూడదని స్పష్టం చేసింది. డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు.. సెలవు తీసుకోవాల్సిందే: తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు..

 

ప్రస్తుతం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలామంది సిబ్బంది మాల ధరించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు యూనిఫామ్ లేకుండా నల్ల దుస్తులు, నల్ల కండువాలు ధరించడం, షూస్ లేకుండా తిరగడం వంటివి చేయరాదని హెడ్ ఆఫీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు జుట్టు, గడ్డం పెంచుకోవద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

 

అయితే, మతపరమైన దీక్షలను శాఖ వ్యతిరేకించడం లేదని, క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీక్ష చేపట్టాలనుకునే వారు ముందస్తుగా అనుమతి తీసుకుంటే రెండు నెలల వరకు సెలవులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీక్షలో ఉంటూ విధులకు హాజరుకావడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram