శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకు గుడ్‌న్యూస్‌

అయ్యప్పస్వాములు ఇరుముడితో విమానంలో వెళ్లేందుకు అనుమతి.. 

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్ : విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు.

అయ్యప్పస్వాములు ఇరుముడితో విమానంలో వెళ్లేందుకు అనుమతి.. ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు అనుమతి ఇచ్చిన కేంద్రం.ఇరుముడితో విమానంలో వెళ్లేందుకు అనుమతులు జారీ చేశాం అయ్యప్ప స్వామి భక్తుల దీక్ష, భక్తి, ఆచార వ్యవహారాల పట్ల గౌరవంతో తీసుకున్న ఈ నిర్ణయం.. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి-కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు.

Facebook
WhatsApp
Twitter
Telegram