మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా. ముదిగొండ రామకృష్ణ

గోల్డెన్ న్యూస్ / మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు మణుగూరు ఏరియా ఆసుపత్రికి మెడికల్ సూపరింటెండెంట్‌గా జనరల్ సర్జన్ డా. ముదిగొండ రామకృష్ణను నియమిస్తూ జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ (DCHS) డా. రవి బాబు ఉత్తర్వులు జారీ చేశారు.

 

డా. ముదిగొండ రామకృష్ణ గతంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌గా సేవలందించారు . ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో ఆయన మణుగూరు ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు.

 

జిల్లా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలను సమర్థవంతంగా వినియోగిస్తూ అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ (DCHS) డా. రవి బాబు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram