ఉప సర్పచ్ ఎన్నిక కూడా రేపే.. . తెలంగాణ రాష్ట్రంలో రేపు మొదటి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గురువారం జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శాంతియుత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారని తెలిపారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు.
ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా రేపే ఉంటుందని స్పష్టం చేశారు. 3,834 గ్రామాలు, 27,628 వార్డుల్లో పోలింగ్ జరగనుందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, తొలి విడతలో భాగంగా 395 గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నిక జరిగిందని రాణి కుముదిని తెలిపారు.









