‘నామమాత్రపు బకాయిలున్నా పేద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు ఎలాంటి నోటీసు కూడా పంపరు. అలాంటిది రూ.118 కోట్లు బకాయిలున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవుల్లో ఉన్న వారి కోసం ఓ చట్టం, పేదవారి కోసం మరో చట్టాన్ని విద్యుత్ అధికారులు రూపొందించారా, అంటూ అసహనం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్లోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) యూనివర్సిటీకి ఉన్న రూ.118.13 కోట్ల పెండింగ్ విద్యుత్ బకాయిలపై, విద్యుత్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక
తన చిన్నతనంలో రూ.800 బిల్లు చెల్లించకపోతే తన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉంటుందా అంటూ హైకోర్టు న్యాయమూర్తి మండిపాటు
విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా కాలయాపన చేస్తున్నారా, పదవుల్లో ఉన్న వారి పట్ల అధికారులు ఇలా వ్యవహరిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆగ్రహం
టీజీఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ, ఈ నెల 22వ తేదీకి కేసును వాయిదా వేసిన హైకోర్టు









