ఒక్క రూపాయికే దహన సంస్కారాలు,
గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహించేందుకు తీర్మానం.
నూతన పాలకవర్గం తొలి సమావేశంలోనే తీర్మానించిన పాలకవర్గం.
గోల్డెన్ న్యూస్ / కరీంనగర్ / కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి పంచాయతీ పాలకవర్గం సాహసపేతమైన నిర్ణయం తీసుకుంది. నిరుపేదలకు అండగా నిలిచేందుకు వినూత్న పథకాన్ని చేపట్టారు. పంచాయితీలో ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్న వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా పంచాయతీ బాధ్యతగా చేపట్టనుంది.
ఒక్క రూపాయికే దహన సంస్కారాలు ప్రారంభించిన తొలి గ్రామపంచాయతీగా చరిత్రలో నిలిచిపోనున్న బూరుగుపల్లి. (గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా)
అలాంటి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నిర్వహించడానికి పంచాయితీ పాలకవర్గం తీర్మానించింది. పరిమిత వనరులతో కూడిన గ్రామపంచాయతీలో ప్రారంభించడానికి ముందడుగు వేసిన సర్పంచ్, పాలకవర్గానికి ప్రజలు అభినందించారు.









