కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి..

గోల్డెన్ న్యూస్/గద్వాల / కన్నతండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ ఘోరానికి మొదటి భార్య కూడా సహకరించడం విచారకరం. బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా విషయం బయటపడింది. పోలీసులు నిందితుడితో పాటు సహకరించిన మొదటి భార్యను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మానవత్వం మంటగలిసిపోయేలా గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరచి కన్నబిడ్డపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి ఆ వ్యక్తి మొదటి భార్య కూడా తోడవ్వడం, ఒక మహిళ అయి ఉండి తోటి ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి దగ్గరుండి సహకరించడం విచారకరం. కంచే చేను మేసిన చందంగా.. రక్షణగా ఉండాల్సిన ఇల్లే ఆ బాలికకు నరకప్రాయంగా మారింది.

 

గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తి గతంలో ఒక మహిళను వివాహం చేసుకోగా, తనకు పిల్లలు పుట్టడం లేదని తన చెల్లితో భర్తకు రెండో వివాహం జరిపించిన మహిళ.

రెండో భార్యకు నలుగురు సంతానం కలగగా, ఇదే సమయంలో మొదటి భార్యకు జన్మించిన ఇద్దరు పిల్లలు.

ఈ క్రమంలో రెండో భార్య కూతురు(16)పై కన్నేసి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన తండ్రి.

బాధితురాలు గర్భం దాల్చడంతో, విషయం బయటికి రాకుండా బాలికకు అబార్షన్ చేయించిన వ్యక్తి మొదటి భార్య .

ఈ విషయాన్ని బాలిక స్థానికంగా ఉండే మరో మహిళకు చెప్పగా, బాధితురాలి తల్లికి విషయాన్ని తెలియజేసిన స్థానిక మహిళ .

బాలిక కన్న తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తండ్రి, అతని మొదటి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Facebook
WhatsApp
Twitter
Telegram