ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఇంద్ర సినిమాలో బ్రహ్మానందం సీన్ రిపీట్ చేసిన దొంగ బాబాలు
అమాయకులే టార్గెట్ గా బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకునే దొంగబాబాలు
గోల్డెన్ న్యూస్ /హనుమకొండ / మీ పల్లెల్లో, మీ వీధుల్లో ఎవరెవరు తిరుగుతున్నారో గమనిస్తున్నారా? ముసుగులు వేసుకుని వస్తున్న మోసగాళ్లను గుర్తు పడుతున్నారా? మూఢ నమ్మకాల పేరుతో, పిచ్చి పిచ్చి వేషధారణల్లో మాయ మాటలతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్లు, ఇల్లు గుల్లవ్వడం ఖాయం. ఇలాంటి ఘటనే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పీఎస్ పరిధి ఉనికిచెర్ల శివారులో జరిగింది.బ్యాగులో పెట్టిన డబ్బులకు పూజలు చేస్తే మూడింతలు అవుతాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.55.55 లక్షలు కొట్టేసిన దొంగబాబాలు.
Post Views: 289









