కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు.

సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు,పేకాట నిర్వహించినట్లయితే కఠిన చర్యలు : ఎస్పీ రోహిత్ రాజు

జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం / సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కడైనా కోడి పందేలు.పేకాట, నిర్వహించినట్లయితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం తన కార్యాలయం నుండి ఒక ప్రకటనను విడుదల చేశారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.నిరంతర వాహన తనిఖీలు,సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా గల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram