తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

గోల్డెన్ న్యూస్/హైదరాబాద్  /తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో నిలుచున్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఓట్లు లెక్కింపు ఉంటుందని, 16న కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు. తుది ఓటింగ్ శాతం మరికొసేపట్లో వెల్లడి కానుంది. ఎన్నికల బరిలో ఉన్నవారి అదృష్టం ఈనెల 13న తేలబోతుంది. ఎన్నికలను సక్సెస్ చేయడంలో అధికారులు, పోలీసులు కృషి అభినందనీయం.స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో సూపర్ సక్సెస్.దేశంలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం..అధికార యంత్రాంగం

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram