చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి
గోల్డెన్ న్యూస్/గన్నవరం / ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో చోటుచేసుకుంది . పోలీసుల కథనం ప్రకారం చిక్కవరం కండ్రిక గ్రామానికి చెందిన బోళ్ల మోహన్సాయి (16), ముచ్చు వెంకట జోసఫ్ (16), దుప్పుల వినయ్‌కుమార్ (12) గొల్లనచిక్కవరం కథనంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోలీ వేడుకలలో రంగులు చల్లుకుని.. తర్వాత స్నానం చేసుకునేందుకు సుందరి చెరువు వద్దకు వెళ్లి కాలుజారి చెరువులో పడ్డారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో రాత్రి . సమయంలో తల్లిదండ్రులు ఆరా తీయగా చెరువు వద్దకు వెళ్లినట్లు గ్రామస్థులు చెప్పారు. చెరువులో గాలింపు చేపట్టగా తొలుత వినయ్‌కుమార్, వెంకట జోసఫ్‌ల మృతదేహాలను, రాత్రి 10:30 గంటలకు మోహన్సాయి మృతదేహాన్ని గుర్తించారు. కుమారులు కళ్లముందు విగతజీవులుగా పడి ఉండడంతో తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.









