విశాఖపట్నం రుషికొండ దరి బీచ్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు దగ్ధం
గోల్డెన్ న్యూస్ /విశాఖపట్నం/ రుషికొండ సమీపంలోని బీచ్ రోడ్డులో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం.
ఆస్తి నష్టం ఎంత? బస్సులో ఎంతమంది ఉన్నారు? షార్ట్ సర్క్యూట్‌నే అసలు కారణమా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 147









